చించోలి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో వైద్య శిబిరం.
మనోరంజని ( ప్రతినిధి )
సారంగపూర్ : డిసెంబర్ 17
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్: మండలంలోని చించోలి(బి)
గ్రామంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో
సుమారు 80 మంది విద్యార్థులకు విరోచనాలు కావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం అత్యవసరంగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ వేదవ్యాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చికిత్సలు అందజేశారు నలుగురికి విరోచనాలు కొంచెం ఎక్కువగా ఉండడంతో వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపి చికిత్సలు అందేలా చర్యలు తీసుకున్నారు ఫుడ్ పాయిజన్ కారణంగా విరోచనాలు అయినట్లు ప్రచారం జరగడంతో వైద్యాధికారి వేద వ్యాస తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్న వారిని కూడా పరిశీలించి చికిత్సలు అందజేశారు