- గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి మంగళగిరి పర్యటన.
- గన్నవరం విమానాశ్రయంలో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం.
- మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరు.
గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు sp పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్బంగా, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది.
కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఐపీఎస్ గౌరవ రాష్ట్రపతికి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, జిల్లా యంత్రాంగం సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎయిమ్స్ విద్యార్థులకు స్నాతక పట్టాలు అందజేయడం జరిగింది.
రాష్ట్రపతి గారి పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిమ్స్ వరకు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.