- ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ సందేశం.
- పటిష్ట చర్యలతో ప్రజా సమస్యల పరిష్కారం.
- శాఖల వారీగా పెండింగ్ అర్జీలు వారంలో పరిష్కరించాలి.
- నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు.
- ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమర్థవంతంగా నిర్వహించడంపై దృష్టి.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల సమస్యలపై పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి ప్రజల నుంచి వివిధ అర్జీలను స్వీకరించారు. శాఖల వారీగా పెండింగ్ సమస్యలను వారంలో పరిష్కరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
,మనోరంజని నిర్మల్:
ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి ప్రజల సమస్యలను పర్యవేక్షించారు.
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, రెవెన్యూ వంటి అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, శాఖల వారీగా పెండింగ్ సమస్యలు వారంలో పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సంక్షేమ వసతి గృహాలను పర్యవేక్షిస్తూ మెరుగైన విద్య, భోజన వసతులు కల్పించాలని, ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నాకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.