విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి. -మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హది.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి.
-మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హది.



నిర్మల్ జిల్లా -సారంగాపూర్,
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని
మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హది అన్నారు
మండలంలోని స్వర్ణ ఆశ్రమ పాఠశాలలో శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్ధుల్ హది అధికారులతో కలసి డైట్ చార్జీలు పెంచిన నూతన మెనూ ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు 40% శాతం డైట్ చార్జీలు పెంచిందని అన్నారు .
విద్యార్థులు రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన ప్రోత్సహకాన్ని అందిపుచ్చుకొని చక్కగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు.
అనంతరం విద్యార్థులతో ముచ్చటించి స్వపక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు,ఎస్సై శ్రీకాంత్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగీత రాణి,హెచ్డబ్ల్యూఓ రాథోడ్ మంగిలాల్,రాజ్ కుమార్, పిల్ల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు,సిబ్బందిపాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment