మానవహారంతో నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు
మనోరంజని, నిర్మల్ ప్రతినిధి, డిసెంబర్ 12
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు పేర్కొన్నారు. గురువారం రోజు ఆర్డీవో కార్యాలయం ముందు గల జాతీయ రహదారిపై మానవహారంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో అరగంట పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడుతున్నటువంటి ఉద్యోగులందరిని వెంటనే ఉద్యోగ భద్రతతో పాటు రెగ్యులరైజ్ చేయాలని , తక్షణమే పే స్కేల్ అమలు చేసి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసి అధ్యక్షులు భూసారం గంగాధర్ పేర్కొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావంగా PRTU తెలంగాణ నిర్మల్ జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న మాట్లాడుతూ రాష్ట్ర అధిష్టానంతో మాట్లాడి తొందరలోనే మీ నాణ్యమైన డిమాండ్లను నెరవేర్చేలా చూస్తానని అన్నారు. మా ఉపాధ్యాయ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే
జిల్లా UTF అధ్యక్షులు దాసరి శంకర్ రాష్ట్ర , జిల్లా నాయకత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు రాజారత్నం, ఫిరోజ్,గజేందర్, నవిత, జ్యోతి, రామ్, నరేశ్,అపర్ణ, వీణ, మహేందర్, తదితరులు పాల్గొన్నారు