గెస్టులు లేరు.. బాలీవుడ్ హీరోలు రాలేదు.. అయినా పుష్పరాజ్ సునామీ..!!
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటే కచ్చితంగా భారీగా ప్రమోషన్లు చేయాల్సిందే. ఆ సినిమాలో ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఉండాల్సిందే. ఎందుకంటే వారు ఉంటేనే కదా బాలీవుడ్ లో ఆ సినిమాకు బిజినెస్ అయ్యేది.
పైగా ఆ మూవీని బాలీవుడ్ లో ప్రమోషన్ చేయాలంటే కచ్చితంగా మరో పెద్దబాలీవుడ్ సెలబ్రిటీ ప్రెస్ మీట్ కో లేదంటే ఈవెంట్ కో రావాలి. ఇక సౌత్ లో కూడా మూవీ ప్రమోషన్ కోసం పెద్ద స్టార్లను గెస్టులుగా రప్పిస్తుంటారు. కోలీవుడ్ లో, మాలీవుడ్ లో, కన్నడలో అక్కడి హీరోలను రప్పించి ప్రమోషన్లు చేయడం మనం చూస్తున్నాం. అప్పుడే ఆ రాష్ట్రాల్లో సినిమాకు మార్కెట్ ఏర్పడుతుంది.
కానీ పుష్ప-2 సినిమాకు మాత్రం ఇవేవీ వర్తించట్లేదు. అల్లు అర్జున్ సినిమా చేసింది రాజమౌళి, శంకర్ లాంటి ఇండియన్ మార్కెట్ ఉన్న డైరెక్టర్లతో కూడా కాదు. సుకుమార్ కు పాన్ ఇండియా క్రేజ్ కూడా లేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం పుష్ప-2తో సొంతంగానే సునామీని సృష్టించారు. అల్లు అర్జున్ తన ఈవెంట్లకు, ప్రెస్ మీట్ లకు ఎక్కడా ఒక్క గెస్టును కూడా పిలవలేదు. సినిమాలో ఒక్క బాలీవుడ్ స్టార్ కూడా లేడు. సొంతంగానే ప్రమోట్ చేసుకుని భారీ హైప్ ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. దాంతో అన్ని భాషల్లో పుష్ప-2కు వస్తున్న క్రేజ్, వసూలు చేస్తున్న కలెక్షన్లు చూస్తే మైండ్ బ్లాంక్ అంటున్నారు. హిందీలో, తమిళం, మలయాళం, కన్నడతో పాటు బెంగాలీలో కూడా పుష్పరాజ్ దుమ్ములేపుతున్నాడు.
ఒక్క పెద్ద గెస్టు కూడా లేకుండా ఇంత పెద్ద మార్కెట్ ను సృష్టించడం అంటే మాటలు కాదు. బాలీవుడ్ ఖాన్ లకు కూడా సాధ్యం కాని విధంగా హిందీ మార్కెట్ లో కలెక్షన్లు రాబట్టం అంటే మాటలు కాదు. దాంతో క్రిటిక్స్ కూడా అల్లు అర్జున్ స్టామినా చూసి ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు