కవ్వాల్ టైగర్ జోన్ పునరావాస గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

కవ్వాల్ టైగర్ జోన్ పునరావాస గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

కవ్వాల్ టైగర్ జోన్ పునరావాస గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

మనోరంజని, నిర్మల్ ప్రతినిధి, డిసెంబర్ 12

కవ్వాల్ టైగర్ జోన్ పునరావాస గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

కవ్వాల్ టైగర్ జోన్ పునరావాస గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కవ్వాల్ ఫారెస్ట్ పునరావాస గ్రామాలు రాంపూర్, మైసంపేట్ ప్రజలకు కల్పిస్తున్న వసతులు, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కవ్వాల్ టైగర్ జోన్ సంబంధించి పునరావాస గ్రామాలైన రాంపూర్, మైసంపేట్ గ్రామాలలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు కవ్వాల్ అడవులను పరిరక్షించాలని సూచించారు. రహదారులు, నివాసాలకు విద్యుత్, త్రాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. వ్యవసాయం, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, గ్రామ పాఠశాలలో పిల్లల భవిష్యత్తుకు భరోసాగా మంచి విద్య అందించాలన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు లేదా స్వయం ఉపాధి మార్గాలను ప్రోత్సహించాలన్నారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ పక్కాగా అమలు చేయాలని సూచించారు. అటవీ భూమల రక్షణ, పర్యావరణం, ప్రకృతి వనరుల పునరుద్ధరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె చర్చించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్న కళ్యాణి, డీఎఫ్ఓ నాగిని భాను, జెడ్పి సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, ఇంజనీరింగ్ అధికారులు అశోక్ కుమార్, శంకరయ్య, డిటిడిఓ అంబాజీ, ల్యాండ్ అండ్ సర్వే ఏడి సుదర్శన్, ఖానాపూర్ ఎఫ్ డి ఓ భవాని శంకర్, అటవీ శాఖ అధికారులు అరుణ్, రాజేందర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడిఓ అరుణ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment