- రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసిన భట్టి విక్రమార్క
- ఏడాది పాలన, మంత్రివర్గ విస్తరణపై చర్చ
- రాహుల్‌తో భేటీకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిసెంబర్ 12న ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్ర పాలన, మంత్రి వర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై రాహుల్‌తో చర్చించినట్టు సమాచారం. రాజస్థాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్‌తో సమావేశం కానున్నారు. పార్టీ పెద్దలతో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిసెంబర్ 12న ఢిల్లీలో భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ మధ్య రాష్ట్ర రాజకీయాలపై కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, తెలంగాణలో ఏడాది పాలనపై సమీక్ష, మంత్రి వర్గ విస్తరణ అంశాలు, స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు తదితర అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం.
రాజస్థాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డిసెంబర్ 12న ఢిల్లీకి రానున్నారు. రేవంత్ కూడా రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు. వచ్చే రోజుల్లో పార్టీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ముందు ఈ సమావేశం కీలకమయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో ఆగమేఘాల మీద జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన అంశాలు కూడా రాహుల్‌తో చర్చకు వస్తాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.