మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మీద ఆరోపణలు అవాస్తవం

మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మీద ఆరోపణలు అవాస్తవం

మాజీ ఎంపిటిసి సభ్యుడు సయ్యద్ ఖలీల్

ఎమ్4 ప్రతినిధి ముధోల్

ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి పై మాజీ ఎంపిటిసి దేవజీ భూమేష్ చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని మాజీ ఎంపీటీసీ సభ్యుడు సయ్యద్ ఖలీద్ అన్నారు. గత పది సంవత్సరాల్లో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి విద్యారంగంలో చేసిన అభివృద్ధి అందరికీ కనబడుతుందని పేర్కొన్నారు. ఎంజేపీ బాలుర గురుకుల- ఎస్టీ గురుకులం -మైనార్టీ గురుకులం- డిగ్రీ కాలేజీ నియోజకవర్గ కేంద్రంలో స్థాపించారు. ఆస్పత్రి టెండర్ అయిన తర్వాత ఒక సంవత్సరం కొన్ని కారణాల వలన పని స్టార్ట్ కాలేదని పని ప్రారంభం అయినా ఆరు నెలలకు ఎలక్షన్ రావడం వలన కాంట్రాక్టర్కు డబ్బులు రాక పనులు నిలిచిపోయాయన్నారు. అదే పనిని ప్రారంభించాలని ఆరోగ్య మంత్రిని కలుస్తే తప్పేంటని నియోజకవర్గం నాయకులు అధికారం కోసం పార్టీలు మారడం అన్ని పార్టీలలో జరిగిన విషయమే ఎలక్షన్ కాకముందు రెండు సంవత్సరాలలో రెండు కోట్లతో అంతర్గత రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సేవ కొరకు అందుబాటు ఉండే మాజీ ఎమ్మెల్యే పై ఆరోపణలు తగదని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment