- దిల్వర్ పూర్-గుండంపల్లి మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తరలించాలని డిమాండ్
- కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నట్లు ఆందోళన
- రైతాంగ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన నాయకులు
దిల్వర్ పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తరలించాలని రైతాంగ నేతలు డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమ వల్ల గాలి, నీటి కాలుష్యం తీవ్రంగా పెరిగి, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఫ్యాక్టరీ రద్దు చేసే వరకు పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని ఏఐకేఎంఎస్, ఏఐపీకేఎస్, టీజేఎస్, ఐఎఫ్టీయూ నాయకులు ప్రకటించారు.
దిల్వర్ పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని రైతాంగం, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం దిలవర్ పూర్ నేషనల్ హైవే వద్ద రోడ్డు దిగ్బంధన కార్యక్రమంలో ఏఐపీకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నందిరామయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. రాజు, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కడపత్రి తిలక్ రావు, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. హరిత తదితరులు పాల్గొన్నారు.
నేతలు మాట్లాడుతూ, ఇథనాల్ పరిశ్రమల వల్ల గాలి, నీటి కాలుష్యంతో పాటు ఘన వ్యర్థాల ప్రభావం తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవడం, భూగర్భ జలాలు మరియు భూమి కాలుష్యం చెందడం వంటి పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
పరిశ్రమను వెంటనే తరలించకపోతే రైతాంగ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల అభిప్రాయాలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. ఫ్యాక్టరీ రద్దు కోసం కొనసాగుతున్న ప్రజల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.