- ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే రామరావు పటేల్
- హామీలు నెరవేర్చకుండా ప్రజా విజయోత్సవాలు జరపడం విడ్డూరం
- ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా ఉండటంపై ఆగ్రహం
- రైతుల రుణమాఫీ, ఉపాధి హామీ నిధులపై డిమాండ్
భైంసాలో జరిగిన ప్రజా విజయోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్, హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలు జరుపడాన్ని తప్పుపట్టారు. ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాథమిక అవసరాలు, రైతుల రుణమాఫీ, ఉపాధి హామీ నిధులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భైంసా మండలంలోని వటోలి గ్రామంలో జరిగిన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ మాట్లాడుతూ, ప్రభుత్వానికిఇన్నెల్లా ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం ఉన్నట్లు విమర్శించారు. “ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా ప్రజా విజయోత్సవాలు జరుపడం విడ్డూరం” అని ఆయన తెలిపారు. ప్రభుత్వ చర్యలపై మండిపడుతూ, గ్రామాల్లో మౌలిక సౌకర్యాల జాప్యం, రైతులకు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డులు, పెన్షన్ల సమస్యలు ఎల్లప్పుడూ పెరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వం తక్షణమే జాతిపంచాయతీ పరిష్కరించే చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ నిధులతో కాంగ్రెస్ నాయకులు విజయోత్సవాలు జరుపుతున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో లాడ్ లి బహన్ పథకం వంటి అవకాశాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎం. పి. వో. మొజామ్, పాధి హామీ ఏపీవో శివలింగయ్య, మరియు అనేక గ్రామస్థులు, నాయకులు పాల్గొన్నారు.