- షాద్ నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈనెల 27న
- మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ పిలుపు
- మంత్రులు, స్థానిక నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారు
- కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరుకావాలని పిలుపు
షాద్ నగర్ లో రైతు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈనెల 27న ఉదయం 11 గంటలకు స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఇతర ప్రముఖులు పాల్గొంటారని కొత్త మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తెలిపారు.
షాద్ నగర్ ప్రభుత్వ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈనెల 27న బుధవారం ఉదయం 11 గంటలకు స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో నిర్వహించనున్నట్లు, కొత్త మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తెలిపారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించబడుతుందని, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారని వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా తప్పక కవర్ చేయాలని సూచించారు.