- నవంబర్ 25 నుంచి ప్రారంభం
- డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి
- 16 కీలక బిల్లులు చర్చకు రానున్నాయి
నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ, రాజ్యసభలో 16 కీలక బిల్లులపై చర్చించనున్నారు. ప్రధాన బిల్లుల్లో జమిలి ఎన్నికల బిల్లు, వక్ఫ్ బిల్లులు ప్రాధాన్యంగా ఉంటాయి. సెషన్‌లో అనుమతించిన అంశాలపైనే చర్చ జరుగుతుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం వివిధ రంగాలకు సంబంధించిన 16 బిల్లులను ప్రవేశపెట్టనుంది. జమిలి ఎన్నికల బిల్లు కీలక చర్చకు దారితీయనుంది. వక్ఫ్ చట్టానికి సంబంధించి రెండు ప్రధాన బిల్లులు కూడా చర్చకు రానున్నాయి.
ప్రవేశపెట్టనున్న బిల్లులు:
- భారతీయ వాయుయన్ విధేయక్ బిల్లు, 2024
- విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు, 2024
- షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణ బిల్లు, 2024
- ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు, 2024
- వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024
- రైల్వే సవరణ బిల్లు, 2024
- బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, 2024
- మర్చంట్ షిప్పింగ్ బిల్లు, 2024
- ఇండియన్ పోర్ట్స్ బిల్లు, 2024
అలాగే, లోక్‌సభ స్పీకర్ మరియు రాజ్యసభ చైర్మన్ పర్యవేక్షణలో అనుమతించబడిన అంశాలపై చర్చలు జరుగుతాయని సమాచారం.