ముధోల్ మరియు బోరేగం గ్రామాలకు 60 లక్షల రూపాయల సీసీ రోడ్డు, డ్రైన్ల ప్రోసిడింగ్ పత్రం

: MLA handing over 60 lakh proceeding document for CC Roads
  • 60 లక్షల రూపాయల సీసీ రోడ్డు, డ్రైన్ల ప్రోసిడింగ్ పత్రం అందజేత.
  • MLA పవార్ రామారావు పటేల్ నిధుల మంజూరీకై ప్రధానిని, ముఖ్యమంత్రి, ఇన్చార్జి మంత్రి సీతక్కకు ధన్యవాదాలు.
  • రోడ్డు పనుల నాణ్యతపై అధికారులకు సూచన.

 ముధోల్ మరియు బోరేగం గ్రామాలకు సీసీ రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణానికి 60 లక్షల రూపాయల ప్రోసిడింగ్ పత్రాన్ని స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్  అందజేశారు. ఈ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి మరియు ఇన్చార్జి మంత్రి సీతక్కకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని వాగ్దానం చేశారు.

ముధోల్ మరియు బోరేగం గ్రామాలకు సీసీ రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణానికి సంబంధించి 60 లక్షల రూపాయల ప్రోసిడింగ్ పత్రాన్ని స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ గారు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నిధులు మంజూరు చేయడంలో సహకరించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ  రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మరియు ఇన్చార్జి మంత్రి సీతక్క  తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ముధోల్ మరియు బోరేగం గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు పనులు నాణ్యంగా జరిగేందుకు అధికారులకు ఆయన సూచనలు ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment