హైదరాబాద్, నవంబర్ 23:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు స్పష్టమవుతున్నాయి. అధికార మహాయుతి కూటమి భారీ ఆధిక్యం సాధిస్తూ, రాష్ట్రంలో కాషాయ గాలి కొనసాగుతోంది. ప్రస్తుతం 160 స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉండగా, మహా వికాస్ ఆఘాడి (ఎంవీఏ) కూటమి 107 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. 9 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
ఎలక్షన్ హైలైట్స్:
- కోప్రి నియోజకవర్గం: సీఎం ఏక్నాథ్ షిండే ముందంజలో.
- వర్లీ నియోజకవర్గం: ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే పోటీ చేస్తుండగా ఆధిక్యంలో ఉన్నారు.
- మాహిన్ నియోజకవర్గం: రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఆధిక్యంలో ఉన్నారు.
- బారామతి: ఎన్సీపీ నేత అజిత్ పవార్ బలంగా నిలుస్తున్నారు.
- సపోలీ: పీసీసీ చీఫ్ నానా పటోలె వెనుకంజలో ఉన్నారు.
ఇతర రాష్ట్రాల ఫలితాలు:
-
వయనాడ్ ఉపఎన్నిక:
ప్రియాంక గాంధీ భారీ లీడింగ్‌లో ఉండగా, 46,000 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. -
ఝార్ఖండ్:
- హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ గండేలో ఆధిక్యంలో ఉన్నారు.
- ధన్వార్‌లో ఝార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి ముందంజలో.
- సరాయ్‌కెలాలో చంపయీ సోరెన్ ఆధిక్యం సాధించారు.
-
నాగ్‌పూర్ సౌత్ వెస్ట్:
డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గట్టి పోటీ లేకుండా ముందంజలో కొనసాగుతున్నారు.
విపక్షం పరిస్థితి:
ప్రతిపక్షం మహా వికాస్ ఆఘాడి కూటమి పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. మహాయుతి సమన్వయం, పటిష్ఠ ప్రచారంతో మహారాష్ట్ర రాజకీయ రంగంలో బలమైన ఆధిపత్యం సాధించింది.