వేములవాడలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వేములవాడ అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
  • సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన
  • దాదాపు రూ.500 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
  • మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమి పూజ
  • అన్నదాన సత్రం, ఎస్పీ కార్యాలయం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభం
  • గల్ఫ్ మరణాల కుటుంబాలకు రూ.85 లక్షల పరిహారం పంపిణీ

వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి పర్యటించారు. రూ. 500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇళ్లు, అన్నదాన సత్రం, ఎస్పీ కార్యాలయం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాలను ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కుటుంబాలకు రూ. 85 లక్షల పరిహారం అందించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని చెప్పారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన దాదాపు రూ. 500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

హెలికాప్టర్ ద్వారా వేములవాడ చేరుకున్న సీఎం రేవంత్, ముందుగా రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం, రూ. 235 కోట్లతో 4,696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.

మరోవైపు, రూ. 35 కోట్లతో అన్నదాన సత్రం, రూ. 26 కోట్లతో ఎస్పీ కార్యాలయం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా, గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు రూ. 85 లక్షల పరిహారాన్ని పంపిణీ చేశారు.

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, వేములవాడ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, భవిష్యత్‌లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment