- సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్ పర్యటనలో
- ఆర్ట్స్ కాలేజీ పరిసరాల్లో కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు
- ఉదయం 9 గంటల నుంచి సమావేశం ముగిసే వరకు ఆంక్షలు
- వాహనదారులకు అవసరం ఉంటే తప్ప రోడ్డు మీదకు రావొద్దని సూచన
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీ పరిసరాల్లో బహిరంగ సభ కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ మళ్లింపులు జరుగుతాయని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. వాహనదారులు అత్యవసరమైతే మాత్రమే రోడ్డు మీదకు రావాలని ఆయన సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్ పర్యటనలో భాగంగా ఆర్ట్స్ కాలేజీ పరిసరాల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం గ్రేటర్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కఠినమైన ఆంక్షలను ప్రకటించారు.
ఉదయం 9 గంటల నుంచి సమావేశం ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు అత్యవసరమైతే మాత్రమే రోడ్డు మీదకు రావాలని సూచించారు. ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీ, వరంగల్ బస్టాండ్, హన్మకొండ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. బహిరంగ సభ సమీప ప్రాంతాల్లో వాహనాలను ఆపడం, పార్క్ చేయడం నిషేధం.
పర్యటన సమయంలో ప్రజలు ట్రాఫిక్ మార్గాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు. సభ విజయవంతం కావడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.