కళాకారులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలి

కళాకారుల ప్రోత్సాహక కవి సమ్మేళనం
  1. నిర్మల్‌లో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం.
  2. కళాకారుల ప్రోత్సాహానికి కలం స్నేహం కార్యక్రమం.
  3. ప్రముఖ కవుల సందేశాత్మక కవితల ప్రవాహం.

 కళాకారుల ప్రోత్సాహక కవి సమ్మేళనం

నిర్మల్ జిల్లాలో రాష్ట్ర స్థాయి కలం స్నేహం కవి సమ్మేళనం నిర్వహించారు. కలం స్నేహం జాతీయ ఉపాధ్యక్షులు హరిరమణ మాట్లాడుతూ కళాకారుల ప్రతిభకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం కల్పించాలని పిలుపునిచ్చారు. వివిధ రంగాల ప్రముఖ కవులు సందేశాత్మక కవితలు వినిపించారు. ఈ కార్యక్రమంలో గాయకులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లాలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో రాష్ట్ర స్థాయి కలం స్నేహం కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలం స్నేహం వ్యవస్థాపకులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య పాల్గొని, కళాకారులను ప్రోత్సహించే విధానాలను గురించి వివరించారు. వారు మాట్లాడుతూ, యువతను ప్రోత్సహించడం, గాయకులకు సినిమాలో అవకాశాలు కల్పించడం, చిన్న కవితలను రాయించడం ద్వారా వారి ప్రతిభను వెలుగులోకి తేవడమే తమ లక్ష్యమని అన్నారు.

https://m4news.in/artists-should-be-given-opportunities-in-all-fields/

కలం స్నేహం జాతీయ ఉపాధ్యక్షులు హరిరమణ మాట్లాడుతూ కళాకారులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించి, వారి ప్రతిభను మరింతగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అడ్మిన్లు గీతాశ్రీ, రాధిక, గౌతమి, సుధ, సరళలు సందేశాత్మక కవితలు వినిపించారు.

కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షులు దేవిప్రియ, జాతీయ సంయుక్త కార్యదర్శులు కడారి దశరథ్, కొండూరి పోతన్న, మరియు పలువురు కవులు, రచయితలు, కళాశారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కళా ప్రియులకు స్ఫూర్తి కలిగించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment