మ4న్యూస్ ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా: నవంబర్ 17, 2024
యూట్యూబ్ న్యూస్ చానల్స్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా యాదగిరిగుట్టకు చెందిన కాలసర్ప న్యూస్ ఛానల్ సీఈఓ గడ్డమీది సత్యనారాయణ గౌడ్‌ను ఆదివారం రోజున యూట్యూబ్ న్యూస్ చానల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు టైగర్ పురం సంతోష్ కుమార్ అధికారికంగా నియమించారు.
ఈ సందర్భంగా గడ్డమీది సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, “నా ఎన్నికకు సహకరించిన వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు టైగర్ పురం సంతోష్ కుమార్, జాతీయ గౌరవ అధ్యక్షుడు టైగర్ అలీ నవాబ్, జాతీయ ప్రధాన కార్యదర్శి గూడెం మధు గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రెంటాల కరుణ కుమార్, చందాలూరి రామ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు డీఎస్ యాదవ్, జూకంటి లక్ష్మి, లక్కిరెడ్డి నరసింహ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మహ్మద్ గఫూర్, సూర్యాపేట, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ముత్యాల బాలకృష్ణ, చిరుమర్తి సైదులు, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ జని గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అని అన్నారు.
అదే విధంగా, “డిసెంబర్ మొదటి వారంలో యాదగిరిగుట్టలో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాను. అలాగే, 100 మంది యూట్యూబ్ న్యూస్ చానల్స్ సీఈఓలతో జిల్లా కమిటీని నియమిస్తానని” గౌడ్ పేర్కొన్నారు.