- కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ పూజలు
- సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం
- ఆలయ అభివృద్ధికి మంత్రి సహకారం ప్రకటింపు
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంత్రి కొండా సురేఖ నందికంది గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పంచామృతాభిషేకం, భస్మాభిషేకం నిర్వహించిన మంత్రి స్వహస్తాలతో హారతిని అందించారు. ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఈ రోజు నందికంది గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ఆలయానికి చేరుకున్న మంత్రి గారికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పంచామృతాభిషేకం, భస్మాభిషేకం నిర్వహించి, స్వహస్తాలతో మహాశివునికి హారతినిచ్చారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి, భక్తులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయ నిర్వాహకులు రామలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టతను మంత్రి సురేఖ గారికి వివరించారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధి కోసం దేవాదాయ శాఖ తరఫున తనవంతు సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిర్వాహకులు ఆమెను శాలువాతో సత్కరించారు.