- గ్రూప్-III పరీక్షలకు 24 పరీక్షా కేంద్రాలు నామినేట్
- 8124 మంది అభ్యర్థులు హాజరు
- 200 మంది పోలీసు అధికారులతో భద్రత
- 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్‌లు మూసివేత
- ఎస్పీ డా. జానకి షర్మిల ప్రకటన
నిర్మల్ జిల్లాలో ఈ నెల 17, 18వ తేదీలలో జరగనున్న గ్రూప్-III పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల వివరించారు. మొత్తం 24 పరీక్షా కేంద్రాల్లో 8124 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 200 మంది పోలీసు అధికారులతో భద్రత ఏర్పాట్లు చేయబడ్డాయి. అభ్యర్థులకు సమస్యలు ఏర్పడితే, డైల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల, ఈ నెల 17, 18 తేదీలలో జరగనున్న గ్రూప్-III సర్వీసెస్ పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణం నందు 24 పరీక్షా కేంద్రాలను నామినేట్ చేయడం జరిగిందని, మొత్తం 8124 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు.
ఎస్పీ మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం, 144 సెక్షన్ అమలు చేయడం, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి దుష్ప్రవర్తనలకు అవకాసం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు, ఇతర దుకాణాలు మూసివేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. 200 మంది పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.