ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ నాథ్ రెడ్డి

ఎమ్4 ప్రతినిధి ముధోల్

ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ నాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన ముధోల్ లోని మహాలక్ష్మి ఆలయం నుండి మాహత్మ గాంధీ చౌక్ వరకు ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా మంజూరైన రూ. 40 లక్షల నిధులతో నిర్మిస్తున్న సిసి రోడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గంగారెడ్డి తో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరను కల్పించేందుకు సోయా వరి పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రోడ్ల పనులను ప్రారంభించి గడువులోగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలను నిర్దేశించిన సమయానికి అందించి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపును సాధించిందన్నారు. నిధులు మంజూరికి కృషి చేసిన మంత్రి సితక్క, మాజీ ఎమ్మెల్యే నారాయణ్ పటేల్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషన్ పటేల్, కిషన్ పతంగి, గోవింద్ పటేల్, అజీజ్, దిగంబర్, నాజిమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment