ఘనంగా ముఖ్యమంత్రి జన్మదినోత్సవ వేడుకలు

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదినోత్సవ వేడుకలు

ఎమ్4 ప్రతినిధి ముధోల్ 

మండల కేంద్రమైన ముధోల్ లోని కొత్త బస్టాండ్ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, కిషన్ పటేల్, కిషన్ పతంగి, మాజీ ఎంపీపీ ఎజాజుద్దీన్, నాయకులు సాయి రెడ్డి, ఖాళీద్ పటేల్, దిగంబర్, గోవింద్ పటేల్, అనీస్, రావుల శ్రీనివాస్, ఎం ఏ అజీజ్, ఇమ్రాన్ ఖాన్, హౌజెకర్ ప్రకాష్, దొడ్డు ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment