పొలంలోకి వేలాడుతున్న విద్యుత్ తీగలు…!

పొలంలోకి వేలాడుతున్న విద్యుత్ తీగలు…!

ఆందోళనకు గురి అవుతున్న రైతులు

ఎమ్4 ప్రతినిధి ముధోల్

మండల కేంద్రమైన ముధోల్ లోని బుద్ధ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమీపంలో ఎల్వత్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పంట పొలంలో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. వరి పంట కోత పనులు ప్రారంభం కావడంతో విజయ్ అనే రైతు హార్వెస్టర్ను తీసుకువచ్చాడు. అయితే విద్యుత్ తీగలు కిందికి వేలాడడంతో పంట కోత పనులు ముందుకు సాగలేదు. హార్వెస్టర్కు విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉండడంతో మధ్యలోనే వరి పంట కోత పనులు ఆగిపోయాయి. దీంతో రైతు ఆందోళనకు గురి అవుతున్నాడు. ప్రస్తుతం కూలీల కొరత ఎక్కువగా ఉండడంతో యంత్రాల ద్వారానే కోత పనులు చేపడుతున్నారు. విద్యుత్ తీగలు ప్రమాద భరితంగా మారిన విషయం పలుమార్లు సంబంధిత సిబ్బందికి తెలిపిన సకాలంలో స్పందించకపోవడంతోనే పంట కూత పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. స్తంభానికి ఏర్పాటుచేసిన సపోర్ట్ వైర్ తెగిపోవడంతో అర్థం వచ్చిందని రైతు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రమాద భరితంగా మారిన విద్యుత్ తీగలను సరిచేయాలని రైతు కోరుతున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment