పాఠశాల స్థాయి చెకుముకి టాలంట్ టెస్ట్
ఎమ్4 ప్రతినిధి ముధోల్
తానూర్ మండలంలోని భోసి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబురాలు 2024 సందర్భంగా పాఠశాల స్థాయిలో చెకుముకి టాలెంట్ టెస్ట్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చి 8,9,10 తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమం ప్రథమ స్థానంలో ఉన్న విద్యార్థులకు మండల స్థాయిలో నవంబర్ 21, జిల్లా స్థాయిలో నవంబర్ 28, రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 14,15,16 తేదీల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్, వందన, గంగాధర్, ద్రుపత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.