రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలి


బైంసా మార్కేట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్
ఎమ్4 ప్రతినిధి ముధోల్
రైతుల తమ వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి లబ్ధి పొందాలని బైంసా వ్యవసాయ మార్కేట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ పేర్కొన్నారు. గురువారం ముధోల్ మండలంలోని రువ్వి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రంను పిఏసీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం రైతుల అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారన్నారు. రైతులు తమ పంట ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తే వారికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉంటుందని అన్నారు. రైతులు తమ పంట ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో రైతులకు కావలసిన అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రువ్వి గ్రామ తాజా మాజి సర్పంచ్ లాలాబాయి గౌతమ్, బ్రాహ్మణగావ్ మాజీ సర్పంచ్ రాంరెడ్డి, అష్ట సర్పంచ్ సుకన్నా రమేష్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ రాంనాథ్ నాయక్, నాయకులు రావుల శ్రీనివాస్, ముత్యం రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.