ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంజలీ గడ్పలేకు సన్మానం
ఎమ్4 ప్రతినిధి ముధోల్
ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ -మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రఖ్యాత గాయకురాలు కుమారి అంజలీ గడ్పలేకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. అంజలీ గడ్పలే స్టార్ ప్రవాహ టీవీ ఛానెల్లో ప్రసారమవుతున్న మీ హోనార్ చోటే ఉత్సద్ కార్యక్రమంలో తన అద్భుతమైన గాన ప్రతిభతో ప్రేక్షకులను అలరించి పోటీలో ఉన్నతమైన స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఇంత చిన్న వయస్సులో అంజలీ సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ప్రతిభను చూసి మనసుకు ఎంతో ఆనందంగా ఉంది. తను ఎక్కడా ఆగిపోకుండా మరింత ముందుకు సాగి మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సాహెబ్ రావు, చంద్రే రాష్టపాల్, చంద్రే రాహుల్, అడ్వకేట్ ప్రవీణ్ ఇప్ప, గోవర్ధన్, కుటుంబ సభ్యులు గడపలే బింబిసార్, తదితరులు పాల్గొన్నారు.