మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి

మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ఎమ్4 ప్రతినిధి ముధోల్


మత్స్యకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం గడ్డెన్న వాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం 13 లక్షల ఇరవై వేల చేప పిల్లలను ప్రభుత్వం 100% రాయితీతో పంపిణీ చేస్తుందన్నారు. అయితే గత సంవత్సరం ఇరవై ఐదు లక్షల చేప పిల్లలు వదిలారని, ఆలస్యం గా పంపిణి చేశారని అన్నారు. ప్రభుత్వం ప్రాజెక్ట్ కు 25 లక్షల చేప పిల్లలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మత్స్యకారుల పక్షాన పోరాడుతానన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో 364 చెరువుల్లో మూడుకోట్ల 25 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి మరింత రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పంపిణీ ప్రక్రియ ఆలస్యమైనందున అధికారులు త్వరితగతిన చెరువుల్లో చేప పిల్లలను వదలాలని, వారికి మత్స్య సంపద జీవనధారమని సూచించారు.. కార్యక్రమంలో ఫిషరీస్ ఏడి, మత్స్యకార సంఘం నాయకులు, కౌన్సిలర్లు గౌతం పింగ్లే, రావుల సువర్ణ పోశెట్టి, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు సోలంకే భీమ్రావు, రమేష్, పండిత్ రావు పటేల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట లింగురాం, బిజెపి పట్టణ అధ్యక్షులు మల్లేష్, నాయకులు తుమొల్ల దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment