రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మహేందర్ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఆదిలాబాద్ లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అండర్-14 జోనల్ కబడ్డీ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. యాద్రాద్రి భువనగిరి లో జరిగే అండర్- 14 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయులు, పిడి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్ష వ్యక్తం చేశారు.