షాది ఖానా నిర్మాణం కోసం ప్రొసీడింగ్ కాపీ అందజేత
ఎమ్4 ప్రతినిధి ముధోల్
ముధోల్ మండలంలోని తరోడా గ్రామంలో షాది ఖానా నిర్మాణం కోసం సుమారు 5 లక్షల రూపాయలు, కబ్రస్తాన్ యొక్క ప్రహరీ గోడ నిర్మాణంకు 2 లక్షల రూపాయల యొక్క ప్రొసీడింగ్ కాపీని ముధోల్ మాజీ శాసనసభ్యులు జీ విఠల్ రెడ్డి అందజేశారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి-నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకి మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు మహబూబ్ ఖాన్, ఆరిఫుద్దీన్, స్థానికులు మోహినుద్దీన్, యూనస్ ఖాన్, ఖజీమ్, ఖలీముల్లా ఖాన్, కుల సంఘ సోదరులు, తదితరులు ఉన్నారు.