6న నిర్మల్లో గౌడ సంఘం జిల్లా మహాసభలు

6న నిర్మల్లో గౌడ సంఘం జిల్లా మహాసభలు

ఎమ్4 ప్రతినిధి ముధోల్

ఈనెల 6 న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రిటైడ్ ఉద్యోగుల సంఘ భవనంలో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నిర్మల్ జిల్లా 4వ మహాసభలను ఉదయం 10:30 నుండి నిర్వహించడం జరుగుతుంది ముధోల్ నియోజకవర్గం అధ్యక్షులు ఆకుల అంజి గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మహాసభలకు జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, మోకుదెబ్బ జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ధిరాములు గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపతి లింగాగౌడ్, ముత్యం నర్సింలు గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేసరి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరెల్లి మల్లా గౌడ్, లతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. కల్తీ పేరిట దాడులు, గ్రామ అభివృద్ధి కమిటీల పేరిట అక్రమ వసూళ్లు దౌర్జన్యాలను అరికట్టాలని మనం కుల వృత్తిపై జరుగుతున్నా దాడులను అరికట్టడానికి ఐక్యంగా ఉద్యమించాలని, కల్లు గీత వృత్తి రక్షణ కై నిర్మల్ జిల్లా కేంద్రంలోని తల పెట్టిన గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నిర్మల్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా గౌడ కులస్తులకు, గీత కార్మికులను కోరుతున్నాం. జిల్లా గౌడ కులస్తుల సమస్యలపై చర్చించి వాటి పరిస్కారం కోసం నూతన జిల్లా కార్యావర్గాన్ని ఎన్నుకోని భవిష్యత్ కార్యక్రమం నిర్ణయించడం జరుగుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment