విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి
మండల విద్యాధికారి రమణ రెడ్డి
ఎమ్4 ప్రతినిధి ముధోల్
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని మండల విద్యాధికారి రమణ రెడ్డి అన్నారు. సోమవారం మండల విద్యావనరుల కేంద్రంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యు-డైస్, అపార్లలో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపి ద్వారా విద్యార్థుల అభ్యాసన ప్రక్రియలను వెలికితీసి పిల్లలు విధ్యపట్ల ఆకర్షితులయ్యే విధంగా బోధించాలన్నారు. డిసెంబర్ 4 న కేంద్రప్రభుత్వం నిర్వహించే ఎన్ఏఏఎస్ పరీక్షకు 3,6,9 తరగతుల విద్యార్థులకు సన్నదం చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నర్సింహచారి, అమీర్ ఖుస్రో, మొహినోద్దీన్, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.