ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం
నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం
మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి
ఎమ్4 ప్రతినిధి ముధోల్
ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని నియోజకవర్గ ప్రజలే నా కుటుంబమని ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి అన్నారు. తానూరు మండలంలోని కోలూరు గ్రామంలో అన్న బాహు సాటే కమిటీ హాల్ నిర్మాణం కోసం సుమారు 2 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని కుల సంఘ సోదరులకు అందజేయడం జరిగింది. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకి మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగరాబాయి రాజన్న, తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ తులసి రామ్, నందుగం మాజీ సర్పంచ్ గని, ధర్మేందర్, బాబు, లక్ష్మణ్, గంగాధర్, వికాస్, రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.