ఈద్గా నిర్మాణంకు నిధులు మంజూరు చేయించిన మాజీ ఎమ్మెల్యే
ఎమ్4 ప్రతినిధి ముధోల్
కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో ఈద్గ నిర్మాణంకు మూడు లక్షల 25వేల రూపాయల మంజూరైన ప్రొసీడింగ్ కాపీని ఓలా మాజీ సర్పంచ్ హైమద్ పాషాకి అందించడం జరిగింది. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి- జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకి ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఓలా మాజీ సర్పంచ్ హైమద్ భాషా, నిర్మల్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సాగరాబాయి రాజన్న, మాజీ ఎంపీపీ తూమ్ రాజేశ్వర్, మాజీ జెడ్పిటిసి ఉత్తం బాలే రావు, మాజీ జెడ్పిటిసి శంకర్ చౌవాన్, మాజీ సర్పంచులు దత్తు గౌడ్, దత్తురాం, మాజీ ఏఎంసీ చైర్మన్ సంతోష్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.