- నైరుతి బంగాళాఖాతంలో 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుంది.
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
- నవంబర్ 2వ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.
- తెలంగాణ, ఏపీ, తమిళనాడులో రెయిన్ అలర్ట్.
భారత వాతావరణ శాఖ మరో అల్పపీడనాన్ని ప్రకటించింది. 6, 7 తేదీల్లో ఏర్పడనున్న ఈ అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు నవంబర్ 7 నుంచి 11 వరకు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అయ్య బాబోయ్.. మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న నేపథ్యంలో, వాతావరణ శాఖ భారీ వర్షాల అంచనాలను ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో 6, 7 తేదీల్లో ఈ అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
నవంబర్ 2వ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ మరియు తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని IMD వెల్లడించింది. తాజా అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 7వ తేదీ నుంచి 11 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. గతంలో కూడా బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. అలాగే, ఏపీ వాతావరణ విభాగం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది.
తమిళనాడులో కూడా హై అలర్ట్ ప్రకటించారు, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 48 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.