ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త దానము

ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త దానము

ఎమ్4 ప్రతినిధి ముధోల్

కుభీర్ మండలంలోని మాలేగాం గ్రామానికి చెందిన సురేష్ ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ పాల్గొని రక్తదాన మహత్తును వివరించారు. ఈ కార్యక్రమంలో సాయరెడ్డి, సాయినాథ్, జీవన్ దాన్ రక్త నీది కేంద్రం నుంచి సహాయకులు గోపాల్, ప్రితం తదితరులు సురేష్ ను ప్రోత్సహిస్తూ పాల్గొన్నారు.
వాడేకర్ లక్ష్మణ్ రక్త దానామూల్యాన్ని, సమాజానికి సేవ చేసే విధానాన్ని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ వీలైనంత మేరకు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం ప్రాణాలను కాపాడగల సాధనం అని, ఈ మార్గంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రేరేపించారు.
ఈ కార్యక్రమం ద్వారా ఆనందిత ఫౌండేషన్ సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో మరో ముందడుగు వేసిందని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment