సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే
ఎమ్4 ప్రతినిధి ముధోల్
కుభీర్ మండలంలోని రంజిని గ్రామానికి చెందిన పుప్పల హరిచరణ్ కు సుమారు 38వేల 500 రూపాయిల సీఎం సహాయనిధి చెక్కును బాధితునికి అందజేయడం జరిగింది. చెక్కు మంజూరు చేసి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకి ప్రత్యేక ధన్యవాదాలు ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కుభీర్ మండల మాజీ ఎంపీపీ తూమ్ రాజేశ్వర్, మాజీ జడ్పిటిసి శంకర్ చౌహన్, మాజీ సర్పంచులు దత్తు గౌడ్, దత్తురం పటిల్, హైమద్ పాషా, మాజీ ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్, మాజీ ఎంపీటీసీలు హన్మాండ్లు, అనిల్. కోరల్ల మల్లేష్, అర్జున్ నాయక్, సాకలి దినేష్, పుప్పాల హన్మాండ్లు, తదితరులు ఉన్నారు.