డైట్-కాస్మటిక్ చార్జీల పెంపుపై గిరిజన గురుకుల విద్యార్థుల హర్షం

డైట్-కాస్మటిక్ చార్జీల పెంపుపై గిరిజన గురుకుల విద్యార్థుల హర్షం

ఎమ్4ప్రతినిధి ముధోల్ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దీపావళి కానుకలో భాగంగా డైట్-కాస్మటిక్ చార్జీల పెంపుపై తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసారు. ఆర్సిఓ ఆగస్టీన్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ శిరీషా ఆధ్వర్యంలో చార్జీల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లకు ధన్యవాదాలు తెలుపుతూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శిరీష మాట్లాడుతూ 3 నుండి 7వ తరగతి విద్యార్థులకు ప్రతి నెల 950 బదులుగా 1330 రూపాయలకు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి 1540 కి, ఇంటర్ విద్యార్థులకు 1500 నుండి 2100 రూపాయలకు డైట్,కాస్మటిక్ చార్జీలు 40 శాతం పెంచడం సంతోషం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment