జోర్ద్ధార్ గా శ్రీ నిమిషాబ్ దేవి పూజలు – అన్న దానం

శ్రీ నిమిషాబ్ దేవి పూజ
  • బాల్కొండలోని శ్రీ నిమిషాబ్ ఆలయానికి 523 సంవత్సరాలు
  • శుక్రవారం దేవికి అభిషేకం, పూజలు నిర్వహించబడ్డాయి
  • అన్నదానంలో భక్తుల దానం

 

బాల్కొండలో 523 సంవత్సరాల పూర్వం వెలిసిన శ్రీ నిమిషాబ్ ఆలయానికి శుక్రవారం అభిషేకం మరియు పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంలో, భక్తులు అమ్మవారికి బియ్యలు సమర్పించారు. అన్నదానంలో భాగంగా, ప్రత్యేక దాతల ద్వారా దానం జరిగింది. జనవరి 2025 నుండి అన్నదానానికి ఖాళీలు ఉన్నాయని ఆలయ సేవకులు తెలిపారు.

 

నిజమాబాద్ జిల్లా బాల్కొండలో 523 సంవత్సరాలుగా వెలిసిన శ్రీ నిమిషాబ్ ఆలయం దేశంలోనే 4వ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శుక్రవారం, ఈ ఆలయంలో శ్రీ నిమిషాబ్ దేవికి అభిషేకం అనంతరం పూజలు నిర్వహించబడ్డాయి. భక్తులు అమ్మవారికి ఓడి బియ్యలను సమర్పించారు.

పూజల అనంతరం, అన్నదానం కార్యక్రమంలో భాగంగా టోకెన్ నెంబర్ 51తో, హైదరాబాద్ లోని నల్లకుంటకు చెందిన “భరద్వాజ గోత్రం” చిత్తారీ శ్రీనివాస్ వర్మ, భారతి, కుమాటుదు కుశల్ రామ్, కూతురు ప్రనూష రామ్, బెంగళూరుకు చెందిన చిత్తారీ కృష్ణమూర్తి మరియు కడప జిల్లాకు చెందిన అన్నయ్య వదినమ్మ రంగనాథ్ వర్మ, లలితమ్మ జ్ఞాపకార్థం అన్నదానం చేశారు. ఈ పూజల్లో అదిలాబాదు, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఔరంగాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుండి భక్తులు పాల్గొన్నారు.

అన్నదానానికి ఖాళీలు:

ఈ ఆలయంలో, 2018 ఏప్రిల్ నుండి ప్రతి నెల మొదటి శుక్రవారం అన్నదానం జరుగుతోంది. జనవరి 2025 నుండి ఆన్నదానానికి ఖాళీలు ఉన్నాయని ఆలయ సేవకులు బి.ఆర్. నర్సింగ్ రావు తెలిపారు. అన్నదానం చేయడానికి ముందుగానే పేరు నమోదు చేసుకోవడం, టోకెన్ నెంబర్ పొందేందుకు సంబంధిత వ్యక్తులను సంప్రదించాలని కోరారు:

  • బి. గంగాధర్: 9441630771
  • బి.ఆర్. నర్సింగ్ రావు: 9666759297
  • బి. రవికిరణ్: 9848123179
  • బి. నరేష్: 9848520806
  • బి. సత్య నారాయణ: 7382843372

Join WhatsApp

Join Now

Leave a Comment