కుటుంబ సర్వే విధుల నుండి మినహాయించండి

కుటుంబ సర్వే విధుల నుండి మినహాయించండి

ఎమ్4 ప్రతినిధి ముధోల్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక-ఆర్థిక-విద్యా-ఉపాధి-రాజకీయ కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) విధుల నుండి మినహాయించండని రాష్ట్ర సిఐటియు కార్యవర్గం ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్స్ ముధోల్ తహసీల్దార్ శ్రీకాంత్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాది రాజకీయం, కుల సర్వే (సమగ్ర) ఇంటింటి కుటుంబ సర్వే) చేయుడానికి అంగన్వాడీ టీచర్లను ఎన్యుమరేటర్ లుగా వేశారని, ప్రస్తుతం పిల్లల బరువులు, పిల్లలకు బాలామృతం పంపిణీ, ఎంఎల్.సి ఎన్నికల నేపథ్యంలో బిఎల్ఒ విధులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పని ఒత్తిడి ఎక్కువగా కావడం వలన అంగన్వాడీ టీచర్స్ లను సమగ్ర ఇటింటి కుటుంబ సర్వేలో ఎన్యుమరేట్ విధులనుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అధ్యక్షురాలు ఎస్. రేష్మ, అంగన్వాడీ టీచర్లు వనిత, బి.రాణి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment