సీఎం సహాయ నిధి చెక్కు అందించిన మాజీ ఎమ్మెల్యే జీ.విఠల్ రెడ్డి
ఎమ్ 4 ప్రతినిధి ముధోల్
తానూరు మండలంలోని ఝరి (బి) గ్రామానికి చెందిన ఉండేపుడు సవితకి సుమారు 26 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును భాదిత కుటుంబానికి అందజేయడం జరిగింది. సీఎం సహాయనిధి చెక్కు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకి ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవిదాస్, దిగంబర్, ఉండేపోడ్ లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకుడు సాయినాథ్ తదితరులు ఉన్నారు.