రైతులకు అందుబాటులోకి డిఎపి ఎరువులు
ఎమ్4 ప్రతినిధి ముధోల్
రైతులకు శనగ విత్తనాలు-ఎరువులు అందుబాటులోకి ఉన్నాయని ముధోల్ పిఎసిఎస్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఒక ప్రకటనలు పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ముధోల్- ఆష్ట-బాసర- బోరేగాం లలో డీఏపీ ఎరువు ఉన్నదని తెలిపారు. ఎరువులు అవసరమైన రైతులు ఆధార్ కార్డు తీసుకొని సంఘంలో సంప్రదించాలని సూచించారు. శనగ విత్తనాలు సైతం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. రైతులకు ఎరువులు శుక్రవారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.