బుద్ధుని బోధనలు అనుసరించాలి
బౌద్ధ భిక్కుని సమవతి
ఎమ్4 ప్రతినిధి ముధోల్
ప్రపంచానికి శాంతి అహింసాయుత మార్గం చూపిన బుద్ధుని బోధనలు అనుసరించాలని బౌద్ధ భిక్కుని సమవతి అన్నారు. బుధవారం తానూర్ మండలంలోని బెంబరా గ్రామంలో భారతీయ బౌద్ధమసభ ఆధ్వర్యంలో నిర్వహించిన బుద్ధుని చరిత్ర గ్రంథ పఠణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌతమ బుద్ధుడు- డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు దీప ధూప పూజలు చేశారు. ఈ సందర్భంగా భిక్కుని మాట్లాడుతూ ప్రజ్ఞ-మైత్రి- కరుణ-ముదిత అనే భావాలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామం నుండి బుద్ధ విహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ గడ్పాలే, జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు, ఎస్సీ ఫర్ ఎస్సీ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మైసేకర్ సాయిలు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తాలూకా అధ్యక్షులు శంకర్ చంద్రే, భారతీయ బౌద్ధమహసభ నాయకులు ఆనందరావు బంసోడే, గంగాధర్, ఆయా గ్రామాల ఉపాసకులు, తదితరులు పాల్గొన్నారు.