పంచాయతీ ఆధ్వర్యంలో గుంతల పూడ్చివేత
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రధాన రహదారులపై అక్కడక్కడ ఏర్పడ్డ గుంతలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పూడ్చివేసే పనులు చేపట్టారు. ప్రమాద భరితంగా మారిన గుంతలను పంచాయతీ ఈవో ప్రసాద్ గౌడ్ గుర్తించి మొరంతో పూడ్చివేసే పనులను చేయించారు. గతంలో రోడ్డుపై ఏర్పడ్డ గుంతలు గమనించక కొందరు ప్రమాదాలకు గురయ్యారు. సకాలంలో స్పందించి ప్రమాద భరితంగా మారిన గుంతలను పూడ్చివేసే పనులు చేపట్టిన పంచాయతీ అధికారుల పనితీరు పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.