రబింద్రా- ప్లే స్కూల్లో ముందస్తు దీపావళి

రబింద్రా- ప్లే స్కూల్లో ముందస్తు దీపావళి

ఎమ్4 ప్రతినిధి ముధోల్

మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్రా- ప్లే స్కూల్లో ముందస్తు దీపావళి పండుగను ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి మాతకు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ అని పేర్కొన్నారు అంధకారాన్ని పారద్రోలి వెలుగును నింపే పండుగ దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దీపావళి పండుగలో ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, ప్లే స్కూల్ అకాడమిక్ ఇంచార్జ్ హేమలత, ఉపాధ్యాయురాలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment