దిగంబర్ మాశెట్టివార్ మృతి పట్ల మున్సిపల్ పాలక వర్గం సంతాపం

దిగంబర్ మాశెట్టివార్ మృతి పట్ల మున్సిపల్ పాలక వర్గం సంతాపం

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఎమ్4 ప్రతినిధి ముధోల్

బైంసా మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టివార్ ఇటీవల మృతి చెందడంతో భైంసా మున్సిపల్ పాలక వర్గం చైర్మన్ సభియా భేగం అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మాశెట్టివార్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ మాట్లాడుతూ 10 సంవత్సరాలపాటు మున్సిపల్ చైర్మన్ గా అయన చేసిన సేవలు అమోఘం అన్నారు.1981 నుండి 1992 వరకు మున్సిపల్ అభివృద్ధి కి పాటు పడ్డారన్నారు. అయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment