పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి

పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి

బాసర ఎంఈఓ జి. మైసాజీ
విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలని బాసర మండల విద్యాధికారి జి. మైసాజి అన్నారు. బాసర మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో యూఎస్ఏ పౌరుల ఆర్థిక సాయంతో నిర్వహించబడుతున్న రూమ్ టు రీడ్ ఇండియా స్పాన్సర్షిప్ ద్వారా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యoలో జిల్లాలోని అన్ని మండలాల్లో మోడల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేశారన్నారు. కలర్ ఫుల్ పెయింటింగ్స్, ప్రత్యేక గ్రంథాలయ గది, విద్యార్థులు చదువుకోవడానికి అనుకూలంగా టేబుళ్లు, కార్పేట్, పుస్తకాలు అమర్చుకోవడానికి ర్యాక్స్ విద్యార్థులు గీసిన చిత్రాలు, రాసిన కథలు ప్రదర్శించడానికి పిన్బోర్డ్స్, తదితర సౌక ర్యాలు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఎన్ఓ నర్సారెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నర్సయ్య, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తేజశ్రీ, ప్రధానోపాధ్యాయులు బి. గంగారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment