సరస్వతి అమ్మవారికి నృత్య కళార్చన
గురువులు విద్యార్థులకు సర్టిఫికెట్ మెమొంటో-బహుకరణ
ఎమ్4 ప్రతినిధి ముధోల్
భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ క్షేత్రంలో శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ శ్రీ జ్ఞాన సరస్వతి నృత్య కళార్చన వారి ఆధ్వర్యంలో అకాడమీ ప్రెసిడెంట్ ఆర్గనైజర్ ఫౌండర్ బి. నాగేంద్ర యాదవ్ నేతృత్వంలో తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల నుండి దాదాపు 160 మంది ఆదివారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఏకధాటిగా తమ కలను ప్రదర్శించారు. ఉదయం ఏడు గంటలకు బాసర ఆలయ క్షేత్రంలోని కోటి గాజుల మండపంలో కలవేదికపై ఆలయ పరిపాలన అధికారి విజయ రామారావు, సుదర్శన్ గౌడ్, వేద పండితులు నవీన్ శర్మ, సంజు పూజారి, ప్రవీణ్ పాటక్, మదన్ మహరాజ్ నేతృత్వంలో వేదమంత్రాలు మధ్య జ్యోతి ప్రజ్వలన చేసి నృత్యాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భరతనాట్యం- కూచిపూడి-కర్ణాటక సంగీతం ఆటపాటలతో కోటిగాజుల మండపం హోరెత్తింది. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల తల్లిదండ్రులతో పాటు భక్తులు ప్రదర్శనలు చూసి అబ్బురపరిచారు. ఈ నేపథ్యంలో ఫౌండేషన్ చైర్మన్ నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ మన దేశంలో చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ఇక్కడ ఉండడం చాలా గర్వకారణం అని నిజానికి ఇక్కడ విద్యార్థులకు అక్షర శ్రీకారం దిద్దటానికి వస్తారు కానీ సరస్వతి అమ్మవారు కల కూడా అంతే అవసరం ఉంటుంది. అమ్మవారికి చేతిలో వీణ ఉండడంతో ఎంతో సంగీతంపై మక్కువ చూపిన అమ్మవారు ఇక్కడ మా విద్యార్థులచే కల ప్రదర్శన ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు దేశ నలుమూలల నుండి అనేక ఆలయాలతో పాటు విదేశాల్లో కూడా మా విద్యార్థులచే అక్కడను ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందని ఇప్పటికే కాశి రానుపాకం తిరుపతి కనకదుర్గ సారంగపాణి బాసర ద్వారా తిరుమల కంచి అన్నవరం శ్రీకాకుళం శ్రీశైలం ఉజ్జయిని ఇలా అనేక దేశాల నలుమూలల నుండి పవిత్ర పుణ్య దేవాలయాల్లో మా ప్రదర్శనలు ఇచ్చి ఇప్పటికే లింకా బుక్ లో చేరామని తెలిపారు. ఇక్కడ మాకు సహకరించిన ఆలయ అధికారి విజయ రామారావు వారి సిబ్బందితోపాటు అన్ని సౌకర్యాలు కల్పించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నృత్య జ్ఞాన జ్యోతి గురువులకు నృత్య జ్ఞాన సరస్వతి అనే పురస్కారాలతో పాటు మెమొంటో సర్టిఫికెట్లను గురువులకు విద్యార్థులకు బహుకరించారు. విద్యార్థుల ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడుతూ బాసర ఆలయ పరిపాలన అధికారి విజయ రామారావు అన్నారు. చాలా చక్కగా మంచి డిసిప్లేన్తో ఉన్న విద్యార్థులు తమ ప్రదర్శనను చూసి ఆకట్టుకునేలా ఉందని వారికి అభినందించారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం అమ్మవారు క్షేత్రంలో కళ ప్రదర్శన ఇవ్వడం చాలా సంతోషకరమని ఫౌండేషన్ చైర్మన్ నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురువులు చైతన్య ఆర్ఎస్ ప్రసాద్, వేదల అనుదేవులపల్లి శ్రీవిద్య, నాట్యమయూరి మజకన్న ప్రసన్న, మోహన్, పద్మజ, మల్లికార్జున, దుర్గా, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.