స్వచ్ఛ కాలనీ సమైక్య కార్యక్రమం 67 వారాలకు చేరుకుంది

స్వచ్ఛ కాలనీ సమైక్య కార్యక్రమంలో కాలనీ సభ్యులు
  • జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమం
  • ఆలయ పరిసరాల్లో శుభ్రత మరియు రోడ్లకు ఇరువైపుల రాళ్ళ తొలగింపు
  • పిచ్చిమొక్కలు, మురుగు కాల్వల శుభ్రపరిచే కార్యక్రమం

 

 జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కార్యక్రమం ఆదివారం 67వ వారానికి చేరుకుంది. ఆలయ పరిసరాల శుభ్రత, రాళ్ళ తొలగింపు, పిచ్చిమొక్కలు, మురుగు కాల్వల శుభ్రపరచడం వంటి పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకారం అందించారు.

 నిర్మల్ జిల్లా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కార్యక్రమం ఆదివారం 67వ వారానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు రోడ్డు ఇరువైపుల రాళ్ళను తొలగించి ప్రజలకు రవాణా సౌలభ్యాన్ని కల్పించడం జరిగింది.

అలాగే కాలనీ పరిసరాల్లోని పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి, మురుగు కాల్వలను శుభ్రపరచడం ద్వారా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎల్.టి. కుమార్, కొక్కెర భూమన్న, గడ్డం శంకర్, ఎర్ర భూమయ్య, కొంతం రాజు, గణేష్, రాజ్ కుమార్, అందాపూర్ సాయన్న, జీవన్, సుంకె నిశాంత్ కుమార్, కేవీ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment