- అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు.
- భద్రతా ప్రమాణాలు పాటించని విక్రయదారులపై చట్ట ప్రకారం చర్యలు.
- దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకునేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు.
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి జానకి షర్మిల అనుమతి లేకుండా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసిన, భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి సందర్భంగా ప్రజల క్షేమం కోసం, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహించిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడిందని ఎస్పీ పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి జానకి షర్మిల దీపావళి పండుగకు ముందు బాణాసంచా దుకాణాల భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పిస్తూ, అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ నిర్మల్ పట్టణ పరిసర గ్రామాలలో అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు జరిపిన వారికి చట్టప్రకారం చర్యలు ఉంటాయని, భద్రతా ప్రమాణాలు పాటించడం తప్పనిసరి అని అన్నారు. దీపావళి పండుగను ప్రజలందరూ సురక్షితంగా జరుపుకోవాలని, ప్రజల క్షేమం దృష్టిలో ఉంచుకొని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.